- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వింబుల్డన్ టైటిల్ దిశగా దూసుకెళ్తున్న అల్కరాజ్
వింబుల్డన్‌లో మెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్‌కు ఎదురులేకుండా పోయింది.

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో మెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్‌కు ఎదురులేకుండా పోయింది. వరుసగా రెండోసారి టైటిల్ సాధించే దిశగా దూసుకెళ్తున్నాడు. తాజాగా సెమీస్‌లో అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అల్కరాజ్ 6-2, 6-3, 6-3 తేడాతో బ్రిటన్ ప్లేయర్ కామెరూన్ నూరీని చిత్తు చేశాడు. కేవలం గంటన్నరలోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడంటే అల్కరాజ్ ఏ విధంగా ఆధిపత్యం ప్రదర్శించాడో అర్థమవుతుంది. ప్రత్యర్థి అతనికి ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. అల్కరాజ్ 13 ఏస్‌లు, 39 విన్నర్లు బాది ప్రత్యర్థిని నిలువరించాడు. దీంతో వరుసగా మూడోసారి వింబుల్డన్‌లో సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇక, మరో టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 జెన్నిక్ సిన్నర్ నాటకీయంగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో రౌండ్‌లో అతను బల్గేరియాకు చెందిన డిమిత్రోవ్‌తో తలపడ్డాడు. అయితే, డిమిత్రోవ్ వరుసగా రెండు సెట్లు గెలవడంతో సిన్నర్ వెనుకబడ్డాడు. సిన్నరకు డిమిత్రోవ్ షాక్ ఇస్తాడేమో అనిపించింది. కానీ, మూడో సెట్ జరుగుతుండగా డిమిత్రోవ్ పెక్టోరల్ కండరానికి గాయమవడంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో సిన్నర్ వాకోవర్ ద్వారా ముందంజ వేశాడు.
సబలెంక హవా
ఉమెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1, టైటిల్ ఫేవరెట్ సబలెంక జోరు కొనసాగుతోంది. సెమీస్‌లో అడుగుపెట్టి తొలి వింబుల్డన్ టైటిల్‌కు ఆమె చేరువైంది. క్వార్టర్ ఫైనల్‌లో సబలెంక 4-6, 6-2, 6-4 తేడాతో జర్మనీకి చెందిన లారా సీజెముండ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట సబలెంకకు షాక్ తగిలింది. తొలి సెట్ ప్రత్యర్థి నెగ్గింది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న సబలెంక మిగతా రెండు సెట్లలో పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. వింబుల్డన్‌లో సబలెంకకు ఇది మూడో సెమీస్. మరో టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ క్వార్టర్స్‌కు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆమె 6-4, 6-4తేడాతో డెన్మార్క్ క్రీడాకారిణి క్లారా టౌసన్‌ను చిత్తు చేసింది.






