- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli: కోహ్లీ 2027 వరల్డ్ కప్ వరకు ఆడతాడా? ఇలా చేస్తే ఆడచ్చు!
Virat Kohli : 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలంటే, కోహ్లీకి ఫామ్‌లో కొనసాగడం తప్పనిసరి.

దిశ, వెబ్ డెస్క్: Virat Kohli : 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలంటే, కోహ్లీకి ఫామ్‌లో కొనసాగడం తప్పనిసరి. ఫిట్‌నెస్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే టెస్టుల నుంచి పూర్తిగా తప్పుకుంటేనే వన్డేల్లో కోహ్లీ రాణించగలడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ..! నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అంతా ఇదే నినాదం. విరాట్ కోహ్లీ మ్యాజిక్ పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతారు. కొంత కాలంగా రిటైర్మెంట్ దగ్గర్లో ఉన్నాడని, ఫామ్ కోల్పోయాడని చాలామంది విమర్శలు చేశారు. కోహ్లీ కూడా తన ఆటలో తక్కువ స్థాయిలో కనిపించాడు. అయితే, ఓ సింహం వెనక్కి తగ్గితే అది మరింత దూకుతుందన్న మాట నిజమే! నిన్న దుబాయ్‌లో అదే జరిగింది. పాకిస్తాన్‌తో మ్యాచుల్లో ఎప్పుడూ అద్భుతంగా ఆడే కోహ్లీ, ఈసారి కూడా జట్టు విజయాన్ని ఖాయం చేయడమే కాకుండా, సెంచరీతో అదరగొట్టాడు.
విరాట్ సెంచరీ చేయకపోతే మ్యాచ్ బోరింగ్ అయిపోయేదనేది వాస్తవం. పాకిస్తాన్ జట్టు ఈ మధ్య కాలంలో వరల్డ్ క్రికెట్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. జట్టులో అంతర్గత సమస్యలు, ఫీల్డింగ్ లోపాలు, వ్యూహాల లేకపోవడం వల్ల కష్టాల్లో ఉంది. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో స్టేడియం సగం ఖాళీగా ఉండటం వారి పరిస్థితిని స్పష్టం చేసింది. ఇక 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ విరాట్ సెంచరీ చూసేందుకు ఫ్యాన్స్ చేసే హడావిడి అసాధారణం. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచే కోహ్లీ తనదైన ఆటతీరు కనబరిచాడు. పాకిస్తాన్‌పై అతనికి ఉన్న అద్భుత రికార్డు యాదృచ్ఛికం కాదని మరోసారి రుజువు చేసుకున్నాడు.
2027 వరల్డ్ కప్ వరకు ఉండగలడా?
విరాట్ 2027 వరల్డ్ కప్ టీంలో ఉండాలంటే, అతని ఫామ్ అత్యంత కీలకం. ప్రస్తుతం ODI క్రికెట్ మెల్లగా తన ప్రభావాన్ని కోల్పోతోంది. IPL ప్రభావంతో టీ20 క్రికెట్ పాపులర్ అవుతోంది. చాలా దేశాలు T20s, టెస్టుల మీదే దృష్టి పెట్టడం ప్రారంభించాయి. ఇప్పటికే విరాట్ టీ20 నుంచి తప్పుకున్నాడు. కానీ టెస్టుల్లో అతని ఫామ్ దిగజారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతను వరుసగా పీచై అవుట్ అవ్వడం అతనికి పెద్ద సమస్యగా మారింది. ఇంగ్లాండ్‌లో జరగబోయే టెస్ట్ సిరీస్ కోహ్లీ కెరీర్‌కు కీలకం. అక్కడ విఫలమైతే, అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్లే. విరాట్‌కు ఏ ఫార్మాట్ బాగా నప్పుతుందంటే, అది ODI. టెస్టులకు గుడ్‌బై చెప్పి, వరల్డ్ కప్ 2027 లక్ష్యంగా ODIలకే పరిమితం అయితే అతనికి మంచి అవకాశాలున్నాయి.
కోహ్లీ ప్లస్ పాయింట్ ఇదే:
కోహ్లీ ఫిట్‌నెస్ పరంగా మాత్రం తిరుగులేని ఆటగాడు. 36 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్ల కంటే వేగంగా పరుగెత్తగలడు. నిన్నటి సెంచరీలో అది స్పష్టంగా కనిపించింది. ODIలలో విజయం సాధించాలంటే ఫిట్‌నెస్ చాలా కీలకం, ఇది కోహ్లీకి పుష్కలంగా ఉంది. 2027 వరల్డ్ కప్ ఆడాలంటే, కోహ్లీకి ఫామ్ కొనసాగడం తప్పనిసరి.






