- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2026 ఆడకపోయినా హర్షిత్ రాణాకు 4 కోట్లు?
ఐపీఎల్ 2026 ఆడకపోయినా హర్షిత్ రాణాకు 4 కోట్లు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బులు బీసీసీఐ ఇవ్వనుందట.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు, కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ( harshit rana) ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ కంటే ముందే హర్షిత్ రాణా మోకాలికి గాయమైంది. ఈ నేపథ్యంలోనే సర్జరీ కూడా చేయించుకున్నాడు ఈ డేంజర్ బౌలర్ హర్షిత్. ఈ మోకాలి గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ తో పాటు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు కూడా దూరమవుతున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
ఐపీఎల్ ఆడకపోయినా హర్షిత్ కు డబ్బులు
గాయం లేదా ఇతర కారణాల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే సదరు ప్లేయర్ కు ఇవ్వాల్సిన ఫీజు ఫ్రాంచైజీ కట్ చేస్తుంది. ఈ లెక్కన హర్షిత్ రాణాకు రావాల్సిన 4 కోట్ల రూపాయలు కేకేఆర్ ఇవ్వదన్నమాట. కానీ బీసీసీఐ ద్వారా ఈ డబ్బులను సంపాదించబోతున్నాడు హర్షిత్. దేశం తరఫున ఆడుతున్నప్పుడు గాయపడి ఐపీఎల్ కు దూరమైతే.. సదరు ఆటగాడికి కచ్చితంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి జీతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
గ్రేడ్ C సెంట్రల్ కాంట్రాక్టు హర్షిత్ రాణాకు ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతనికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది బీసీసీఐ. ఆ నాలుగు కోట్లను కేకేఆర్ స్థానంలో ఇన్సూరెన్స్ పాలసీ కింద బీసీసీఐ హర్షిత్ రాణాకు చెల్లిస్తుంది అన్నమాట. దీంతో సేఫ్ జోన్ లోకి హర్షిత్ వెళ్తాడు. ఇది కేవలం భారత గ్రేడ్ క్రికెటర్లకు మాత్రమే వర్తిస్తుంది.






