- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన విషయం తెలిసిందే. కేవలం బ్యాటింగ్ సమయంలోనే మైదానంలోకి వచ్చి ఫీల్డింగ్‌లో డకౌట్‌కే పరిమితమయ్యాడు. ఇది హిట్‌మ్యాన్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫిట్‌నెస్ లేదనో, గాయాలో, ఫామ్ లేమో కారణం కచ్చితంగా తెలియదు కానీ అతన్ని మాత్రం ముంబై జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకుంది. దీంతో ఈ సీజన్‌లో కూడా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే కొనసాగుతాడా? అన్న ఎంఐ అభిమానుల్లో ఉన్న సందేహం. దీనికి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సారి రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించే ఆలోచన లేదని, ఎక్కువగా మైదానంలోనే ఉంటాడని వెల్లడించాడు. ‘గతేడాది అతను గాయాలతో ఇబ్బందిపడ్డాడు. కాబట్టి, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించాం.అతను మైదానంలో ఉన్నా లేకపోయినా జట్టుపై భారీ ప్రభావాన్ని చూపుతాడు. ఈ ఏడాది రోహిత్‌ను ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచాలనుకుంటున్నా. అయితే, జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉన్నందు వల్ల పరిస్థితులను బట్టి ఇంపాక్ట ప్లేయర్‌ను రొటేట్ చేస్తాం.’అని జయవర్ధనే తెలిపాడు. ఇటీవలే ముంబై క్యాంప్‌లో చేరిన రోహిత్ ఈ సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.






