WI vs AUS : రెచ్చిపోయిన గ్రీన్, ఓవెన్.. తొలి టీ20 ఆస్ట్రేలియాదే

by Harish |

వెస్టిండీస్‌‌తో టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా మొదలుపెట్టింది.

WI vs AUS : రెచ్చిపోయిన గ్రీన్, ఓవెన్.. తొలి టీ20 ఆస్ట్రేలియాదే
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌‌తో టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా మొదలుపెట్టింది. సోమవారం జరిగిన తొలి టీ20లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 స్కోరు చేసింది. రోస్టన్ చేజ్(60) మెరుపు హాఫ్ సెంచరీకితోడు కెప్టెన్ షాయ్ హోప్(55) కూడా రాణించాడు. హెట్మేయర్(38) కూడా మెరుపులు మెరిపించాడు. ఫేర్‌వెల్ సిరీస్ ఆడుతున్న ఆండ్రూ రస్సెల్(8) తొలి టీ20లో నిరాశపరిచాడు. టాపార్డర్ చెలరేగడంతో వెస్టిండీస్ భారీ స్కోరు చేసేలా కనిపించింది.

కానీ, ఆసిస్ పేసర్ ద్వార్షుయిస్ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. నాలుగు వికెట్లు తీసి కట్టడి చేశాడు. అయితే, ఆసిస్ ముందు విండీస్ 190 పరుగుల టఫ్ టార్గెటే పెట్టింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా శ్రమించింది. కానీ, గ్రీన్(51), మిచెల్ ఓవెన్(50) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో ఆ జట్టు విజయం సాధించింది. 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్‌కు ‌ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. అరంగేట్ర మ్యాచ్‌లోనే అతను సత్తాచాటి ఆసిస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టీ20లో గెలుపుతో ఆస్ట్రేలియా ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నెలలోనే వెస్టిండీస్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో ఆసిస్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.


Next Story