చాన్స్ ఇవ్వనప్పుడు నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారు?.. అశ్విన్ ఫైర్

by Harish |

భారత ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సౌతాఫ్రికాతో తొలి వన్డేలో బెంచ్‌కే పరిమితమయ్యాడు.

చాన్స్ ఇవ్వనప్పుడు నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారు?.. అశ్విన్ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సౌతాఫ్రికాతో తొలి వన్డేలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. తుది జట్టులోకి అతన్ని తీసుకోకపోవడంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఫైర్ అయ్యాడు. జట్టు ఎంపికలోనే ఏదో తప్పుందన్నాడు. అతన్ని ప్లేయింగ్ 11లోకి తీసుకోనప్పుడు ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు.‘హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీశ్ కుమార్ రెడ్డిని తుది జట్టుకు ఎంపిక చేయాలి. అలా జరగలేదంటే జట్టు ఎంపికలోనే ఏదో తప్పుంది. చోటు ఇవ్వనప్పుడు అతన్ని ఎందుకు ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్యా ఏం చేయగలడో నితీశ్ అదే చేయగలడు. అది వాస్తవం. అతను మెరుగవుతాడు. ప్లేయింగ్ 11లో అతనికి స్థానం దక్కలేదంటే జట్టు ఎంపికను సమీక్షించాలి.’అని అశ్విన్ చెప్పాడు. అలాగే, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లను అశ్విన్ ప్రశంసించాడు. ఇప్పుడు భారత్ ఆడే దూకుడు బ్యాటింగ్‌కు వారే కారణమన్నాడు. ‘రాహుల్ భాయ్ మనం ఇలాగే ఆడాలని చెప్పాడు. రోహిత్ దారి చూపించాడు. మార్గం సుగుమం చేశాడు. భారత జట్టు బ్యాటింగ్‌ పూర్తిగా మారిపోయింది. వైట్‌బాల్ క్రికెట్‌లో బ్యాటింగ్‌ అంటే సగటు కాదు స్టైక్‌రేటు.’అని చెప్పుకొచ్చాడు.


Next Story