15-20 ఏళ్లు రెస్ట్ లేకుండా ఆడా.. ఇప్పుడే నాకు రెస్ట్ దొరికింది : విరాట్ కోహ్లీ

by Harish |

ఐపీఎల్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు.

15-20 ఏళ్లు రెస్ట్ లేకుండా ఆడా.. ఇప్పుడే నాకు రెస్ట్ దొరికింది : విరాట్ కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు రవిశాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కోహ్లీ చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన సుదీర్ఘ విరామం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గత 15-20 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడాడని చెప్పాడు. దీంతో తాను సరైన రెస్ట్ తీసుకోలేకపోయానని తెలిపాడు. కుటుంబానికి కావాల్సిన సమయం కేటాయించలేకపోయానని చెప్పుకొచ్చాడు. ‘టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాకే నాకు చాలా సమయం దొరికింది. నేను ఇప్పుడే జీవితాన్ని ప్రారంభించా. ఇప్పుడు నా పిల్లలకు సమయాన్ని వెచ్చిస్తున్నా. కుటుంబంతో గడపడం అద్భుతమైన దశ. చాలా ఎంజాయ్ చేస్తున్నా.’అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కలిపి అందరి కంటే తానే ఎక్కువ క్రికెట్ ఆడాడని చెప్పాడు. ఇప్పుడీ విరామం తనను చాలా రిఫ్రెష్ చేసిందన్నాడు. ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నానని, ఆస్ట్రేలియాకు రిఫ్రెష్‌గా వచ్చానని తెలిపాడు.


Next Story