షమీ, భువీని సెలక్షన్ చేయకపోవడం పై విమర్శలు..అగార్కర్ క్లారిటీ

by velandi.Saikiran |

షమీ, భువీని సెలక్షన్ చేయకపోవడంపై విమర్శలు వ‌స్తున్న నేప‌థ్యంలో అగార్కర్ క్లారిటీ ఇచ్చారు.

షమీ, భువీని సెలక్షన్ చేయకపోవడం పై విమర్శలు..అగార్కర్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ లో ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు భారత జట్టులో వాళ్లకు స్థానమే లేకుండా పోయింది. భవిష్యత్తులో కూడా వాళ్లకు అవకాశం వచ్చేలా కనిపించడం లేదు. దాదాపు ఈ ఇద్దరు డేంజర్ బౌలర్ల కెరీర్ ముగిసినట్లేనని చెప్పుకోవచ్చు. ఆఫ్గనిస్తాన్ తో జరగాల్సిన టెస్ట్, మూడు వన్డేల నేపథ్యంలో భారత జట్టును ప్రకటించారు. ఇందులో మహమ్మద్ షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ పేరు భూతద్దం పెట్టిన కూడా కనిపించలేదు.

భారత సెలక్టర్లు వీళ్ళపై ఏ మాత్రం దయ చూపించలేదు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోలేదు. అయితే దీనిపై అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత ఆట తీరు, సీనియారిటీ ఆధారంగా ప్లేయర్లను సెలెక్ట్ చేయలేదన్నారు. ఫిట్ నెస్, భవిష్యత్తును ఉద్దేశించి ప్లేయర్ల సెలక్షన్ జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో అగార్కర్ పై తీవ్రస్థాయిలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రిష‌బ్ పంత్ టెస్ట్ వైస్ కెప్టెన్సీని కూడా తొల‌గించారు. అత‌ని స్థానంలో కేఎల్ రాహుల్ కు ఛాన్స్ వ‌చ్చింది.

Next Story