కోహ్లీ తప్పు చేశావు.. ఇక క్రికెట్ చూడను.. విరాట్ ఫ్యాన్ ఎమోషనల్

by Harish |

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కోహ్లీ తప్పు చేశావు.. ఇక క్రికెట్ చూడను.. విరాట్ ఫ్యాన్ ఎమోషనల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఎమోషనల్ అయ్యాడు. ‘కోహ్లీ భయ్యా రిటైర్ ఎందుకయ్యావు..ఇక నేను క్రికెట్ చూడను’ అంటూ విరాట్ ముందే భావోద్వేగానికి గురయ్యాడు.

మంగళవారం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ‘కోహ్లీ సర్ మీరు తప్పు చేశారు. ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు?. ఇక మేము క్రికెట్ చూడలేం. నీకోసమే టెస్టు మ్యాచ్‌లు చూస్తాం.’ అని సదరు అభిమాని చెప్పాడు. కోహ్లీ కారు ఎక్కబోతుండగా మరో అభిమాని కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పటివరకు మీకోసం క్రికెట్ చూశాం. ఇకపై చూడం.’ అని చెప్పాడు. వన్డేలలో ఆడటం చూస్తామని, ఈ సారి ఆర్సీబీ గెలుస్తుందని మరో అభిమాని అన్నాడు. సదరు అభిమానికి కోహ్లీ థంప్స్ అప్ సింబల్ చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గతేడాది కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇక, వన్డేలలో మాత్రమే ఆడనున్నాడు. 123 టెస్టులు ఆడిన కోహ్లీ 9,230 రన్స్ చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.


Next Story