- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL చరిత్రలో కొత్త రికార్డ్..రంగంలోకి 16 ఏళ్ల ప్లేయర్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగారు దీయా యాదవ్.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సరికొత్త రికార్డు నమోదయింది. ఈ టోర్నమెంటులో 16 సంవత్సరాల ఓ లేడీ క్రికెటర్ అరంగేట్రం చేశారు. ఆమె ఎవరో కాదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన దీయా యాదవ్. ఈమె వయసు ప్రస్తుతం 16 సంవత్సరాల 103 రోజులు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగారు దీయా యాదవ్.
ఈమెను మొన్నటి వేలంలో పది లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది ఢిల్లీ. దీయా యాదవ్ కోసం యూపీ కూడా పోటీపడింది. కానీ చివరికి ఢిల్లీ సొంతం చేసుకుంది. ఈమె హర్యానాకు చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. షిఫాలీ వర్మ లాగా భయంకరంగా హిట్టింగ్ చేస్తుంది. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పదహారేళ్ల దీయా యాదవ్ టోర్నమెంట్ లో అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలోనే WPL లో ఆడిన అత్యంత పిన్న వయసుకురాలిగా రికార్డులోకి ఎక్కింది దీయా యాదవ్. అటు ఐపీఎల్ లో వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం 14 సంవత్సరాలు ఉన్నాడన్న సంగతి తెలిసిందే.






