విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ కాదు.. మరి AB డివిలియర్స్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ T20 ప్లేయర్‌ ఎవరు..?

by Disha Web Desk 12 |
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ కాదు.. మరి AB డివిలియర్స్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ T20 ప్లేయర్‌ ఎవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ దక్షిణాఫ్రికా బ్యాటర్ మిస్టర్ 360 డిగ్రిస్ గా పేరొందిన AB డివిలియర్స్ తన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ T20 ప్లేయర్‌ ఎవరో తెల్చేశాడు. అయితే డివిలియర్స్ ఓ ప్లేయర్ ఎంచుకుంటున్నాడు అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, లేదా.. క్రిస్ గేల్. కానీ AB డివిలియర్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ ను.. డివిలియర్స్ తన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ T20 ప్లేయర్‌ ఎంచుకున్నాడు.

“నా అత్యుత్తమ టీ20 ఆటగాడు మరెవరో కాదు, రషీద్ ఖాన్. అతను బ్యాట్, బాల్ తో విద్వంసం సృష్టించగలడు. రెండు విభాగాల్లో మ్యాచ్ విజేత ఆటను ప్రదర్శిస్తాడు. అతను ఫీల్డ్‌లో లైవ్‌వైర్ సింహం యొక్క హృదయాన్ని పొందాడు. అతను ఎల్లప్పుడూ గెలవాలని కోరుకుంటాడు, అతను చాలా పోటీ తత్వాన్ని కలిగి ఉన్నాడు. అతను ఉత్తమ T20 ఆటగాళ్లలో ఒకరితో అక్కడే ఉన్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్, ది బెస్ట్' అని ఏబీ డివిలియర్స్ అన్నారు.



Next Story