- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ టైమింగ్స్.. ఫ్రీగా ఎలా చూడాలి?
నేటి నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్

దిశ, వెబ్ డెస్క్ : నేటి నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో... అసలు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది...? ఏ ఛానల్ , ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూడాలని అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ మొత్తం కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది.
మొదటి సెషన్ మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే రెండవ సెషన్ సాయంత్రం 6:10 గంటల నుంచి రాత్రి 8:10 గంటల వరకు కొనసాగుతుంది. ఇక మూడవ సెషన్... 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ఉంటుంది. ఇలా ఐదు టెస్టులు కూడా.. ఇదే తరహాలో కొనసాగుతాయి. ఇవాళ జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్.. ఈ నెల 24వ తేదీ వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఉచితంగా చూసేందుకు డిడి స్పోర్ట్స్ కూడా ముందుకు వచ్చింది. ప్రత్యేక కారణాల వల్ల డిడి స్పోర్ట్స్ లో కూడా ఉచితంగా ప్రసారాలు అందిస్తున్నారు. అలాగే జియో హాట్ స్టార్, సోనీ స్పోర్ట్స్ లో కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ చూడవచ్చు.
twitter link
🚨 SESSION TIMING FOR INDIA vs ENGLAND TEST SERIES 🚨
— Johns. (@CricCrazyJohns) June 19, 2025
1st session - 3.30 to 5.30 pm IST.
2nd session - 6.10 to 8.10 pm IST.
3rd session - 8.30 to 10.30 pm IST. pic.twitter.com/Xod8JsDBMD






