అతను ద్విశతకం చేసినప్పుడే నా కెరీర్ ముగిసింది : శిఖర్ ధావన్

by Harish |

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అతను ద్విశతకం చేసినప్పుడే నా కెరీర్ ముగిసింది : శిఖర్ ధావన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో అతను చివరిసారిగా బంగ్లాదేశ్‌ టూరులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మూడు వన్డేల్లో ఘోరంగా విఫలమైన అతను కేవలం 18 రన్సే చేశాడు. ఆ టూరు తర్వాత అతను తిరిగి టీమిండియా గడప తొక్కలేకపోయాడు. మరోవైపు, అదే టూరులో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(210) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బంగ్లా పర్యటనను గుర్తు చేసుకున్న ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడంతో తన కెరీర్ ముగిసిపోయిందని అర్థమైందన్నాడు. ‘నేను చాలా 50లు చేశాను. ఎక్కువగా సెంచరీలు చేయలేదు. కానీ, 70లు ఎక్కువగానే చేశాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడో అప్పుడే ‘నా కెరీర్ ముగింపు దశకు వచ్చింది’అని నా అంతరాత్మ చెప్పింది. అదే జరిగింది. ఆ సమయంలో నా స్నేహితులు నాకు మద్దతుగా నిలవడం నాకు ఇంకా గుర్తుంది. నేను కుంగిపోతానని అనుకున్నారు. కానీ, నేను ఆనందంగానే ఉన్నా.’అని తెలిపాడు. ధావన్ తన ఆత్మకథ ‘ది వన్’ను మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story