- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPl 2025) చివరి దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPl 2025) చివరి దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు టీమిండియా ( India vs England ) రెడీ కానుంది. దీనికోసం ఇప్పటికే టీమిండియా టెస్ట్ కెప్టెన్ అలాగే జట్టును కూడా ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య... ఐదు టెస్టులు జరగబోతున్నాయి.
ఇందులో మొదట వామప్ మ్యాచ్ జూన్ 13వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు కొనసాగుతుంది. జూన్ 20వ తేదీ నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం అవుతుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య... మొదటి టెస్ట్ లీడ్స్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ లు ప్రారంభం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ 20వ తేదీన ప్రారంభం కానున్న ఈ టెస్ట్ సిరీస్ ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది.
లండన్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను... సోనీ స్పోర్ట్స్ దక్కించుకుంది. అలాగే ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ఎప్పటిలాగే జియో హాట్ స్టార్ ( JioHotstar) కైవసం చేసుకుంది. జియో సబ్ స్క్రైబర్లకు ఉచితంగా ఈ మ్యాచ్ లు ప్రసారం కానున్నాయి.






