- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇరుజట్ల కెప్టెన్లు ఏమన్నారంటే..?
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా ఓడించింది. ఈ మ్యాచ్ ఫలితంపై ఇరుజట్ల కెప్టెన్లు స్పందించారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా ఓడించింది. అద్భుతంగా పోరాడిన సఫారీలు సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ విజయం తర్వాత ఇరుజట్ల కెప్టెన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎవరేమన్నారంటే..
స్వదేశంలో ఉన్నామనే ఫీలింగ్..
ఈ నాలుగు రోజులు చాలా స్పెషల్. ఒక్కోసాని మేం సౌతాఫ్రికాలోనే ఆడుతున్నాం అనిపించింది. మేం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చాం. మమ్మల్ని ఎంతోమంది అనుమానించారు. కానీ మేం మాత్రం ఫుల్ నమ్మకంతో బరిలో దిగాం. కాంట్రవర్సీతో వచ్చిన రబాడ.. అసలు ఆ ఆలోచనే లేకుండా తన పని తను చేసుకుపోయాడు. ఇక మార్క్రమ్ తన స్పెషల్ ఆట చూపించాడు. అసలు అతను జట్టులో అవసరమా? అన్న వాళ్లు కూడా ఉన్నారు. వారికి ఇదే సమాధానం. భవిష్యత్తులో దక్కే ఎన్నో విజయాలకు ఇది ఆరంభం అని ఆశిస్తున్నా. -- సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా
ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు..
మేం కొన్ని పనులు అనుకున్నట్లు చెయ్యలేకపోయాం. తొలి ఇన్నింగ్సులో మంచి లీడ్ దొరికినా రెండో ఇన్నింగ్సులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. నాలుగో ఇన్నింగ్సులో మాకు సౌతాఫ్రికా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మా టీంలో టాప్-7 ప్లేయర్లపై కొంత ఆందోళన ఉంది. కానీ వీళ్లంతా గత రెండేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మ్యాచులో లియాన్ సూపర్ బౌలింగ్ చేశాడు. కానీ వికెట్లు దొరకలేదు. అద్భుతమైన ఆటతో ఫైనల్‌కు ఎలా వచ్చారో సౌతాఫ్రికా టీం చూపించింది. ఇదే క్రికెట్‌కు అత్యుత్తమ స్థాయి. అందుకే నాకు టెస్టు క్రికెట్ అంటే ఇష్టం. గెలవకపోయినా ఫైనల్ చేరడమే గొప్ప అచీవ్‌మెంట్. --ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్






