- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం..భారత్ కు భారీ ఊరట !
సూపర్ 8 లో భాగంగా జింబాబ్వేపై 107 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో ప్రభంజనం సృష్టించిన జట్టు జింబాబ్వే. అరి వీర భయంకరమైన ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి జట్లను మట్టి కరిపించి, సూపర్ 8లోకి ఎంటర్ అయింది జింబాబ్వే. దీంతో ఈ నాకౌట్ స్టేజ్ లో కూడా అన్ని జట్లకు చుక్కలు చూపిస్తుందని అందరూ జింబాబ్వే పై అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడే జింబాబ్వే బోల్తా కొట్టింది. సూపర్ 8లో దారుణ ఓటమి చవిచూసింది జింబాబ్వే. ముంబై వేదికగా వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య సోమవారం కీలక మ్యాచ్ జరిగింది. సూపర్ 8లో భాగంగా జరిగిన ఈ రసవత్తర పోరులో ఎట్టకేలకు వెస్టిండీస్ విజయం సాధించింది. అంచనాలకు మించి రాణించ గల వెస్టిండీస్ జట్టు చేతులో, జింబాబ్వే ఏకంగా 107 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ ఆశలను జింబాబ్వే చేజేతులా కోల్పోయింది. అటు భారత జట్టు పరిస్థితి కూడా ఇలానే తయారైంది.
వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన జింబాబ్వే
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో దారుణంగా ఓడిపోయింది జింబాబ్వే. ఇందులో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 254 పరుగులు సాధించింది వెస్టిండీస్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జింబాబ్వే దారుణంగా విఫలమైంది. 17.4 ఓవర్లు ఆడిన జింబాబ్వే, భారత జట్టు తరహాలోనే తొందరగానే కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో 147 పరుగుల వద్ద జింబాబ్వే ఆలౌటై, 107 పరుగుల తేడాతో ఓడిపోయింది.
జింబాబ్వే ఓటమి భారత జట్టుకు కలిసి వస్తుందా?
టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన భారత జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. సెమీ ఫైనల్ చేరడంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో జింబాబ్వే ఓటమి భారత జట్టుకు కలిసి వచ్చే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. సూపర్ 8 లో భాగంగా భారత్ తన నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వే తో ఆడబోతున్న సంగతి తెలిసిందే. భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య చెన్నై వేదికగా ఫిబ్రవరి 26వ తేదీన మ్యాచ్ జరగనుంది. అయితే వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన జింబాబ్వే ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడింది. అలాంటి జట్టును భారత్ ఓడించడం చాలా ఈజీ అవుతుంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా భారత పంజా విసిరే ఛాన్స్ ఉంటుంది. ఇక ఒత్తిడిలో ఉన్న జింబాబ్వే పై భారీ తేడాతో భారత విజయం సాధిస్తే, రన్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే జింబాబ్వే ఓటమి భారత జట్టుకు కలిసి వస్తుందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. జింబాబ్వే ను ఓడించిన తర్వాత విండీస్ ను పడగొట్టడం ఇండియాకు ఈజీ అయిపోతుంది. మరి ఈ సదవకాశాన్ని భారత జట్టు ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.






