- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ జట్టు ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్(West Indies) జట్టు ఘన విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యఛేదనలో 166 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఆలౌటైంది. దీంతో 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్(England) బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ 30, సామ్ కరణ్ 40, జకాబ్ 33, బట్లర్ 21 పరుగులతో రాణించినా ఓటమి తప్పలేదు. వెస్టిండీస్ బౌలర్లలో మోటీ మూడు వికెట్లు, రొస్టన్ రెండు వికెట్లు, షెఫార్డ్, జోసెఫ్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 196 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (42 బంతుల్లో 76 పరుగులు) చెలరేగి ఆడటంతో కరేబియన్ జట్టు భారీ స్కోర్ చేసింది. అలానే రోస్టన్ చేజ్(29 బంతుల్లో 34 పరుగులు), జాసన్ హోల్డర్(17 బంతుల్లో 33 పరుగులు) కూడా రాణించారు. హెట్మెయర్(23) రోవ్ మన్ పావెల్(14) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, జేమీ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ , సామ్ కుర్రన్ తలో వికెట్ సాధించారు.






