టఫ్ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన విండీస్.. తొలి వన్డే పాక్‌దే

by Harish |   (  Updated:2025-08-09 13:00:30  IST  )

వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో కూడా శుభారంభం చేసింది.

టఫ్ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన విండీస్.. తొలి వన్డే పాక్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో కూడా శుభారంభం చేసింది. ట్రినిడాడ్‌లో శనివారం జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌటైంది. 49 ఓవర్లలో 280 పరుగులు చేసి కుప్పకూలింది. లెవిస్(60), కెప్టెన్ షాయ్ హోప్(55), రోస్టన్ చేజ్(53) హాఫ్ సెంచరీలు చేయగా.. షెఫెర్డ్(31) కూడా రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు, నసీమ్ షా 3 వికెట్లతో కరేబియన్ జట్టు పతనాన్ని శాసించారు. అయితే, పాక్ ముందు 281 పరుగుల టఫ్ టార్గెట్‌ను విండీస్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హసన్ నవాజ్(63 నాటౌట్) అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. చివరి వరకూ నిలిచి పాక్‌ను గెలిపించాడు. అతనికితోడు రిజ్వాన్(53), హుస్సేన్ తలత్(41 నాటౌట్), బాబర్ ఆజామ్(47) సత్తాచాటడంతో పాక్ 48.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో పాక్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం రెండో వన్డే జరగనుంది.

Next Story