- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెలిచినా విండీస్‌కు తప్పని నిరాశ.. 0.01 తేడాతో వరల్డ్ కప్ బెర్త్ దూరం
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టును దురదృష్టం వెంటాడింది.

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టును దురదృష్టం వెంటాడింది. వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించినా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. నెట్‌రన్‌రేట్‌లో 0.01 తేడాతో విండీస్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది. మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శనివారం లాహోర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో థాయిలాండ్‌పై విండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా థాయిలాండ్ 46.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. నత్తకాన్ చంతమ్(66) హాఫ్ సెంచరీ చేయగా మిగతా వారు నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో ఫ్లెట్చర్ 4 వికెట్లు, ఆలియా అలీన్ 3 వికెట్లతో సత్తాచాటారు.
167 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 4 వికెట్లు కోల్పోయి 10.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ మాథ్యూస్(70) విధ్వంసకర ఇన్నింగ్స్‌కుతోడు హెన్రీ(48) కూడా మెరుపులు మెరిపించడంతో వెస్టిండీస్ సునాయాసంగా గెలిచింది. అయితే, ఈ విజయం విండీస్‌కు వరల్డ్ కప్ బెర్త్ అందించలేకపోయింది. క్వాలిఫయర్స్ నుంచి టాప్-2 జట్లు మాత్రమే క్వాలిఫై అవుతాయి. పాకిస్తాన్ తొలి స్థానంలో నిలువగా.. రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, విండీస్ పోటీపడ్డాయి. అయితే, బంగ్లా మెరుగైన నెట్‌రన్‌రేటుతో క్వాలిఫై య్యింది. బంగ్లా 0.639 నెట్‌రన్‌రేట్‌ను కలిగి ఉండగా.. విండీస్ 0.626 నెట్‌రన్‌రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య కేవలం 0.01 తేడా మాత్రమే. ఆ తేడా విండీస్‌కు నిరాశ కలిస్తే బంగ్లాదేశ్‌కు మాత్రం వరల్డ్ కప్ బెర్త్ అందించింది. శనివారమే పాకిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమిపాలవడం గమనార్హం.






