T20WorldCup2026: చితక్కొట్టిన వెస్టిండీస్ బ్యాటర్స్.. భారత్ ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు.

T20WorldCup2026: చితక్కొట్టిన వెస్టిండీస్ బ్యాటర్స్.. భారత్ ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. సమిష్టిగా రాణించి భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. మొత్తంగా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్ (32), రోస్టన్ చేజ్ (40), హెట్మెయర్ (27), రోవ్‌మన్ పావెల్ (34), జాసన్ హోల్డర్ (37) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా రెండు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. భారత్ విజయం సాధించాంటే 196 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్‌కు వెళ్లనుంది.

భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్: షాయ్ హోప్(కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.

Next Story