- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెటర్‌గా మెరుగయ్యానంటే నాన్నే కారణం : అర్ష్‌దీప్ సింగ్
తాను క్రికెటర్‌గా మెరుగుపడటానికి తన తండ్రే కారణమని టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వెల్లడించాడు.

దిశ, స్పోర్ట్స్ : తాను క్రికెటర్‌గా మెరుగుపడటానికి తన తండ్రే కారణమని టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్ష్‌దీప్.. తనను కుటుంబం ఎంతో ప్రోత్సహించిందని చెప్పాడు. ‘నేను బాగా ఆడిన మ్యాచ్‌ల గురించి మా నాన్న ఎక్కువగా మాట్లాడడు. ఆయన కార్పొరేట్ మ్యాచ్‌లు ఆడారు. శని, ఆదివారాలు ఆడతాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నాకు గణాంకాలు పంపేవారు. ‘నాలుగు ఓవర్లు వేసి 19 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాను. నా కంటే బాగా బౌలింగ్ చేయి చూద్దాం’అని అనేవారు. అది నాపై ఒత్తిడిని పెంచేది. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే కార్పొరేట్ మ్యాచ్‌ల్లో ఆడే తీరు భిన్నింగా ఉంటుందని మొదట్లో ఆయనకు అర్థం కాలేదు. కానీ, నిరంతరం నన్ను ప్రోత్సహించేవారు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని మా నాన్న, కోచ్ చెప్పేవారు. ప్రాక్టీస్‌లో 80 శాతం బౌలింగ్ చేయడానికి శ్రమిస్తే మ్యాచ్‌లో అది సగం మాత్రమే కనిపిస్తుంది. మ్యాచ్ అనంతరం కుటుంబం నుంచే ఎక్కువ మెసేజ్‌లు వస్తాయి. ‘సిక్సర్ కొడతాడని తెలిసినప్పుడు యార్కర్ ఎందుకు వేయలేదు?’అని ప్రశ్నిస్తారు. మా కుటుంబంలో అందరూ బౌలింగ్ కోచ్‌లే’అని అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. తాను యార్కర్లు వేయడం బుమ్రా నుంచే నేర్చుకున్నానని చెప్పాడు.
- Tags
- Arshdeep Singh






