- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేము ఏ జట్టునైన ఓడిస్తాం.. భారత్ తో మ్యాచ్ వేళ పాకిస్తాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా ఈ నెల 14న అంటే ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా ఈ నెల 14న అంటే ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ తో ఎటువంటి సిరీస్‌లను ఆడబోదని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ వేదిక కావడంతో ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. దీంతో ఈ మ్యాచ్ ను ఆడేందుకే ఇరు జట్లు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. కానీ రెండు వైపుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ జరగడానికి ముందే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా (Captain Salman Agha) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, బ్యాటింగ్ విభాంగంలో కొంచెం మెరుగు పడాల్సిన అవసరం ఉందని, తాము ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నందును ఆసియా కప్ లో ఏ జట్టునైన ఓడిస్తామని ధీమాను కెప్టెన్ అఘా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ నిర్వాహణపై ACC, ICC నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాకపోవడం గమనార్హం గా మారిపోయింది.






