ఉచితంగా ఐపీఎల్‌ లైవ్‌ను ఇలా చూసేయండి!

by Disha Web Desk 1 |
ఉచితంగా ఐపీఎల్‌ లైవ్‌ను ఇలా చూసేయండి!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి టైమ్ రానే వచ్చింది. మొత్తం పది జట్లు ట్రోఫీ కోసం పోరుకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు పోయిన ఏడాది ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా గతేడాదే ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్‌ సూపర్ పవర్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు చెత్త ప్రదర్శనతో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఐపీఎల్ టెలివిజన్ బ్రాడ్‌కాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకోగా, డిజిటల్ మాధ్యమ హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్‌ను జియో సినిమాలో పూర్తి ఉచితంగా కూడా వీక్షించొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా జియో కనెక్షనే. అదొక్కటి ఉండి, సరిపడా డేటా ఉంటే ఐపీఎల్‌ను రాయల్ గా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.


Next Story

Most Viewed