- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ వెనుక హెడ్ కోచ్ గంభీర్ ఉన్నాడని వార్తలు వచ్చాయి. వారితో గంభీర్‌కు విభేదాలు ఉన్నట్టు కూడా కథనాలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్‌ను ఈ విషయం గురించి అడిగారు. దానికి గంభీర్.. కోహ్లీ, రోహిత్‌ల పేర్లు ప్రస్తావించుకుండా పరోక్షంగా తాను తప్పుచేసినట్టు అంగీకరించాడు. అదే సమయంలో తనను తాను సమర్థించుకున్నాడు. తన ఉద్దేశాలు సరైనవే అయినప్పుడు తప్పిదాలు ఆమోదయోగ్యమేనని చెప్పాడు. ‘నేను మనిషినే. నేనూ తప్పులు చేశా. ప్లేయర్లూ చేస్తారు. గత 18 నెలల్లో నా నుంచి తప్పులు జరిగాయి. నేను దానికి సిగ్గుపడను. కానీ, నేను ఒక్కటే నమ్ముతాను. సరైన ఉద్దేశంతో తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఆమోదయోగ్యమే. కానీ, డ్రెస్సింగ్ రూంలో తప్పుడు ఉద్దేశంతో తీసుకునే తప్పుడు నిర్ణయాలు క్షమించరానివి. నా డ్రెస్సింగ్ రూంలో నేను నిజాయితీగా ఉంటూ ప్లేయర్ల కళ్లలోకి నేరుగా చూసి మాట్లాడగలిగినంత వరకూ నా స్థానంలో నేను న్యాయమైన పనే చేస్తున్నానని భావిస్తా.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.






