'అవమానంగా అనిపించింది'.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై వార్నర్ ఫైర్

by Disha Web Desk 13 |
అవమానంగా అనిపించింది.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై వార్నర్ ఫైర్
X

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ)పై ఆసిస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి విరుచుకపడ్డాడు. తాజా ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ.. తన విషయంలో సీఏ తీరు హాస్యాస్పదంగా ఉందన్నాడు. తాను గతాన్ని ముగిద్దామనుకుంటే.. వారు కొనసాగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యాడు. ‘బోర్డులో ఒక్కరు కూడా పారదర్శకంగా లేరు. బోర్డులో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ఆ విషయాన్ని నేను వదిలేద్దామనుకున్న ప్రతిసారీ సీఏ పెద్దలు దానిని బయటకు తీస్తూనే ఉన్నారు. అదంతా నా వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపింది. టెస్టు మ్యాచ్‌ల సందర్భంగా ప్రతి రోజూ నాకు ఉదయాన్నే లాయర్ల నుంచి ఫోన్లు వచ్చేవి. అదంతా నాకు అగౌరవంగా అనిపించింది.

ఆ ప్రభావం నా ప్రదర్శనపై పడింది. ఆటపై ఫోకస్ పెట్టలేకపోయా. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది.’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. బాల్ టాంపరింగ్‌‌ కేసులో డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించడంతో పాటు కెప్టెన్సీపై జీవితకాలం నిషేధం విధించింది. కెప్టెన్సీ బ్యాన్‌పై వార్నర్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దాన్ని ఉపసంహరించుకున్నాడు.



Next Story

Most Viewed