- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంత్‌లా ఆడాలనుకుంటా : రాహుల్
తనకు రిషబ్ పంత్‌లా ఆడాలని ఉంటుందని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : తనకు రిషబ్ పంత్‌లా ఆడాలని ఉంటుందని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రాహుల్(100) సెంచరీతో రాణించాడు. లార్డ్స్ స్టేడియంలో అతనికిది రండో శతకం. శినివారం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. పంత్‌తో బ్యాటింగ్ చేయడడం ఆస్వాదిస్తానని చెప్పాడు. అలతల షాట్లు కొట్టాలనే కోరికను వ్యక్తం చేశాడు. ‘మా ఇద్దరి మధ్య కొన్ని సారూపత్యలు ఉన్నాయి. ఇద్దిరికీ ఆట పట్ల ప్రేమ ఉంది. బ్యాటింగ్ చేయడం ఇద్దరికీ ఇష్టం. కీలక సమయాల్లో నాణ్యమైన ప్రదర్శన చేయాలని చూస్తా. కొన్నేళ్లుగా పంత్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశా. అతడితో బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. పంత్ బ్యాటింగ్‌ను గమనిస్తుంటా. నేను కూడా అతనిలా ఆడాలనుకుంటా. మ్యాచ్‌లు లేనప్పుడు అతనిలా షాట్లు కొట్టలని కలలుకంటా.’అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్ రెండో శతకాన్ని నమోదు చేశాడు. మూడో టెస్టులో సెంచరీ చేసి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వెనుకడకుండా కీలక పాత్ర పోషించాడు.






