రిటైర్ అయ్యాక 'అలా' అవ్వాలనుంది! టీమిండియా స్టార్ ప్లేయర్

by Geesa Chandu |

నా జీవితం విషయంలో ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లేదు కానీ ఇదంతా ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ముగుస్తుందని మాత్రం తెలుసు.

రిటైర్ అయ్యాక అలా అవ్వాలనుంది! టీమిండియా స్టార్ ప్లేయర్
X

దిశ, వెబ్ డెస్క్: నా జీవితం విషయంలో ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లేదు కానీ ఇదంతా ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ముగుస్తుందని మాత్రం తెలుసు. అలాంటి రోజైతే నాకు త్వరగా రాబోతుందని అంటున్నాడు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్. ఒకప్పుడు కెల్ రాహుల్ స్టార్ క్రికెటర్ హోదాకు ఏ మాత్రం తక్కువ కాదని అనిపించినా.. ఆ తర్వాత మాత్రం అతని ప్రదర్శన ఆశించినంత గొప్పగా లేదు. మరోవైపు ఐపీఎల్ లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు మళ్లీ గతంలో మాదిరిగా మంచి ఫాం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని అంటున్నాడు రాహుల్.

అయితే..కేఎల్ రాహుల్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ లో తన కెరీర్, రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. " భవిష్యత్ గురించి నాకు 29 ఏళ్ళు వచ్చినా ఆలోచించలేదు, కానీ నా 30 వ పుట్టిన రోజున నా క్రికెట్ కెరీర్ గడువు ఇంకో పదేళ్లే అనే నిజాన్నిప్రస్తుతం గ్రహించాను. అయితే ఫిట్ గా ఉంటే ఎవరైనా 40 ఏళ్లు వచ్చేవరకు ఆడొచ్చు. ఒక అథ్లెట్ కెరీర్ అనేది చాలా చిన్నది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అలా అని జీవితం మొత్తాన్ని రిటైర్మెంట్ తో ఆపలేం కదా.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక నా సంపాదన ఎలాగో తగ్గుతుంది. దాని తర్వాత ఏం చెయ్యాలి అనే దానిపై ఇప్పుడు ఆలోచిస్తున్నాను అని, అయితే రిటైర్ అయ్యాక పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్.

Next Story