- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hasaranga celebration: పాకిస్థాన్ ప్లేయర్ చిల్లర వేశాలు..ఇజ్జత్ తీసిన హసరంగా
పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ చేసిన చిల్లర పనులకు... పాకిస్తాన్ స్టార్ ఆటగాడు హసరంగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ చేసిన చిల్లర పనులకు... పాకిస్తాన్ స్టార్ ఆటగాడు హసరంగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. మళ్లీ ఇంకా ఎప్పుడు కూడా ఇలా చిల్లర వేషాలు వెయ్యకుండా... తన బౌలింగ్ తో బుద్ధి చెప్పాడు హాజరంగా. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక... ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోయి... ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ మ్యాచ్ లో... మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంకను పాకిస్తాన్ బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక ఆటగాడు హసరంగా వికెట్ తీశాడు అబ్రార్. అనంతరం.. తన చేతి వేళ్లను చూపిస్తూ అసభ్యకర సైగలు చేశాడు. దీంతో అక్కడి నుంచి హసరంగా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు హసరంగా. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో ఆరు సిక్సులు కొడతానన్న ఆయుబును క్లీన్ బౌల్డ్ చేశాడు హసరంగా. అనంతరం... పెవిలియన్ లో కూర్చున్న అబ్రార్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు హసరంగా. ఇది నా తడాఖా అంటూ... సైగలు చేశాడు. ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్స్... పాకిస్థాన్ వాడికి సరిగ్గా బుద్ది చెప్పావ్ అని హసరంగాను మెచ్చుకుంటున్నారు. క్లిక్






