ఇంగ్లాండ్ లోనే టీమిండియాను వదిలేసి..స్వదేశానికి గంభీర్.. రంగంలోకి కొత్త కోచ్?

by velandi.Saikiran |   (  Updated:2025-06-15 13:19:40  IST  )

ఇంగ్లాండ్ ( England) వర్సెస్ టీమిండియా ( Team India) మధ్య టెస్ట్ సిరీస్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో... గిల్ (

ఇంగ్లాండ్ లోనే టీమిండియాను వదిలేసి..స్వదేశానికి గంభీర్.. రంగంలోకి కొత్త కోచ్?
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ ( England) వర్సెస్ టీమిండియా ( Team India) మధ్య టెస్ట్ సిరీస్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో... గిల్ ( Shubhman Gill) జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండులో ఉన్న టీమిండియాను వదిలేసి అర్ధాంతరంగా... స్వదేశానికి వచ్చేసాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir). ఈ నేపథ్యంలోనే.. టీమిండియాను లీడ్ చేసేందుకు మరో కొత్త రంగంలోకి దిగబోతున్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

టీమిండియాతో కలిసి ఇటీవలే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత... తన తల్లి ఆరోగ్యం క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో వెంటనే ఇండియాకు వచ్చేసాడు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని... ఆమె కోలుకునే వరకు గౌతమ్ గంభీర్ సెలవులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ కు గౌతమ్ గంభీర్ దూరం కాబోతున్నాడని చెబుతున్నారు. అయితే గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో వివిఎస్ లక్ష్మణ్ కు ( VVS Laxman) భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) నుంచి పిలుపు వచ్చింది అట.

వెంటనే ఇంగ్లాండ్ వెళ్లాలని... టీమిండియాను లీడ్ చేయాలని వివిఎస్ లక్ష్మణ్ కు ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో లక్ష్మణ్ కూడా హడావిడిగా వెళ్లిపోయారట. గౌతమ్ గంభీర్ వచ్చేవరకు ఇంగ్లాండులోనే వివిఎస్ లక్ష్మణ్ ఉంటాడు. అటు గతంలో కూడా దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో కూడా టీమిండియా కు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ అందుబాటులో లేని సమయంలో కచ్చితంగా లక్ష్మణ్ రంగంలోకి దిగుతున్నారు. అతని ఆధ్వర్యంలో కూడా టీమిండియా కు మంచి ఫలితాలే వచ్చాయి.


Next Story