గంభీర్ రెక్కలు విరిచిన బీసీసీఐ.. రంగంలోకి కొత్త కోచ్..?

by velandi.Saikiran |

టెస్ట్ క్రికెట్ ఆడే టీం ఇండియాకు... ప్రత్యేకంగా ఒక స్పెషల్ హెడ్ కోచ్ ను నియామకం. ఇందుకోసం vvs లక్ష్మణ్ ను ఫైనల్ చేయబో

గంభీర్ రెక్కలు విరిచిన బీసీసీఐ.. రంగంలోకి కొత్త కోచ్..?
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెక్కలు కత్తిరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ మ్యాచులకు ప్రత్యేకంగా హెడ్ కోచ్ ను నియామకం చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం టీమిండియా వన్డే, టీ20లు, టెస్టులకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా కొనసాగుతున్నారు.

దీనివల్ల గౌతమ్ గంభీర్ పై వర్క్ లోడ్ ఎక్కువ అవుతోంది. అలాంటి సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ ను ( VVS Laxman)... వాడుకుంటోంది బీసీసీఐ పాలక మండలి. ఏదైనా సిరీస్ కు గౌతమ్ గంభీర్ లీవ్ తీసుకుంటే.. ఆ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ అవతారం ఎత్తుతున్నారు. అయితే ఇకపై అలా కాకుండా.. టెస్ట్ క్రికెట్ ఆడే టీం ఇండియాకు... ప్రత్యేకంగా ఒక స్పెషల్ హెడ్ కోచ్ ను నియామకం చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట.

ఇందుకోసం vvs లక్ష్మణ్ ను ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే గౌతమ్ గంభీర్ కేవలం.. టి20 లు అలాగే వన్డే మ్యాచ్ లకు మాత్రమే కోచ్ గా కొనసాగుతాడు అన్నమాట. అటు టెస్టులకు vvs లక్ష్మణ్.. హెడ్ కోచ్ గా మారతాడు. టెస్టుల్లో మంచి అనుభవం లక్ష్మణ్ కు ఉంది. అది టీమిండియా కు చాలా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.



Next Story