VVS Lakshman : భారత జట్టు కొత్త కోచ్‌గా VVS లక్ష్మణ్..!

by Malleboina Mahesh |   (  Updated:2023-11-23 06:12:55  IST  )

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ భద్యతలు ఈ నెల 19న అధికారింగా ముగిసాయి.

VVS Lakshman : భారత జట్టు కొత్త కోచ్‌గా VVS లక్ష్మణ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ భద్యతలు ఈ నెల 19న అధికారింగా ముగిసాయి.అయితే అనంతరం ఆయన కాంట్రాక్ట్ పొడిగింపపై ఎటువంటి ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. దీంతో భారత హెడ్ కోచ్ స్థానం కోసం పోటీలో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, VVS లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతుంది. దానికి VVS లక్ష్మణ్ కోచ్‌గా ఉన్నాడు.

ఇదిలా ఉంటే, ద్రవిడ్ తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకోని పక్షంలో, లక్ష్మణ్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 49 ఏళ్ల అతను 2021లో NCA చీఫ్ కావడానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మెంటర్‌గా పనిచేశాడు. అయితే లక్ష్మణ్ కే హెడ్ కోచ్ బాధ్యతలు ఇస్తారా..? లేదా మరెవరికైనా ఇచ్చే అవకాశం ఉందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story