చిన్నస్వామి స్టేడియం ఘటన.. భయానక వీడియో వైరల్

by velandi.Saikiran |

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinna swamy stadium) వేదికగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన

చిన్నస్వామి స్టేడియం ఘటన.. భయానక వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinna swamy stadium) వేదికగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో... ఏకంగా 11 మంది మరణించారు. మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ( RCB Fans). అయితే ఈ సంఘటన... ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందని కొంత మంది చెబుతున్నారు.

19వ గేట్ దగ్గర... అభిమానులు తోసుకుంటూ ముందుకు రావడంతో... పరిస్థితి అదుపు తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలోనే 11 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే ఈ తొక్కిసలాట నేపథ్యంలో చాలా మంది పరుగులు పెట్టారు. దీంతో చాలా మంది తమ చెప్పులను కూడా లెక్కచేయకుండా వదిలేసి వెళ్లిపోయారు.

కింద పడుతూ లేస్తూ... పరిగెత్తారు. అయితే.. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడి విజువల్స్ ఇప్పుడు.. వైరల్ గా మారాయి. ఇందులో చాలా మంది చెప్పులను స్టేడియం బయట వదిలి వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. వాటిని చూస్తే... ఈ సంఘటన ఎంత దారుణంగా జరిగిందో మనం ఊహించవచ్చు. ఇది ఇలా ఉండగా మృతుల కుటుంబాలకు అలాగే గాయపడ్డ వారికి కర్ణాటక సర్కార్ అటు మోడీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

Next Story