- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్ జంట!
ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకోవటం సాధారణంగా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకోవటం సాధారణంగా మారిపోయింది. టీమిండియా క్రికెట్‌లో కూడా చాలా మంది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో చాహల్(Chahal) తన భార్య ధనశ్రీ(Dhanusri) విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).. అతడి భార్య ఆర్తి అహ్లావత్ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 20 ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, ఈ జంట గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటారనే ప్రచారం కూడా ఊపందుకుంది.
వీరేంద్ర సెహ్వాగ్ 2004లో ఆర్తి అహ్లావత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యవీర్(2007), వేదాంత్(2010) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్యంలో ఇటీవల మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సెహ్వాగ్ ఇన్‌స్టా పోస్టుల్లో సతీమణి కన్పించకపోవడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. చివరిసారిగా 2023లో తమ పెళ్లి రోజు సందర్భంగా భార్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరూ, ఆర్తి డివోర్స్ చేసుకోవడం పక్కా అని సన్నిహితులు అనుకుంటున్నారు. అయితే, ఈ వార్తలపై సెహ్వాగ్, ఆర్తిలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
ఇక ఢిల్లీకి చెందిన ఆర్తి అహ్లవత్.. చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తారు. ఆమె 1980 డిసెంబర్ 16న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మైత్రేయి కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక సెహ్వాగ్.. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా గోప్యంగా ఉంచుతూ వచ్చారు సెహ్వాగ్.






