- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాతో మ్యాచ్ వేళ.. విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన ట్వీట్
స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి సోషల్ మీడియాలో కొట్లాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ రోజు ఉదయం పెట్టిన పోస్ట్ (Post) ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆరుసార్లు ప్రపంచ కప్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టుతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు బుధవారం రాత్రి పెర్త్‌లో అడుగుపెట్టింది. ఈ సిరీస్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొని ఉన్న వేళ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గురువారం ఉదయం కోహ్లీ ఎక్స్‌లో ఇలా వ్రాశాడు .
“మీరు నిజంగా విఫలమయ్యే ఏకైక సమయం, మీరు వదులుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే.” (The only time you truly fail, is when you decide to give up) అని రాసుకొచ్చాడు. ఈ సందేశం కేవలం ఒక ట్వీట్‌గానే కాకుండా, ప్రస్తుత తరం యువతకు, క్రీడాభిమానులకు ఒక స్పూర్తిగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీ ఈ మాటలు ఆయన మానసిక బలాన్ని, పట్టువదలని ప్రతిబింబిస్తాయని అభిమానులు పేర్కొంటున్నారు. పెర్త్ నుండి వచ్చిన ఈ సందేశంతో, అభిమానులు “కింగ్ కోహ్లీ” మరోసారి గ్రౌండ్‌లో తన మాంత్రిక ప్రదర్శనతో భారత్‌కు విజయం అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






