- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli: నేను, రోహిత్ క్రీజులో ఉన్నామంటే ఛేజ్ చేయడం ఈజీ
సిడ్నీ మైదానం(Sydney Stadium) వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ మైదానం(Sydney Stadium) వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్‌లో అదరగొట్టారు. రోహిత్ శర్మ(121) సెంచరీతో రఫ్పాడించగా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 236 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్.. మరో 11.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడారు. ‘‘తొలి రెండు మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ అయినందుకు బాధపడ్డా. కానీ ఇవాళ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశా.. మంచి భాగస్వామ్యంతో మ్యాచ్ ఫినిష్ చేయడం ఆనందంగా ఉంది.. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం మాకు అలవాటే.. నేను, రోహిత్ క్రీజులో ఉన్నామంటే ఛేజ్ చేయడం చాలా ఈజీ’’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు. అంతకుముందు రోహిత్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం ఆస్వాదిస్తా.. సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.






