- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరుమీదున్న టీమిండియా.. కోహ్లీ హాఫ్ సెంచరీ
by Gantepaka Srikanth |
జోరుమీదున్న టీమిండియా.. కోహ్లీ హాఫ్ సెంచరీ

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత(India vs South Africa) బ్యాటర్లు రఫ్పాడిస్తున్నారు. ఇప్పటికే సెంచరీతో జైస్వాల్, హాఫ్ సెంచరీతో రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా బౌలర్లకు చెమటలు పట్టించగా.. తాజాగా కింగ్ కోహ్లీ అదరగొట్టారు. హాఫ్ సెంచరీతో రాణించారు. కేవలం మూడు సిక్సులు, నాలుగు ఫోర్లతో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా సఫారీలకు తొలుత బ్యాటింగ్ అప్పగించింది. సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీ బాదాడు. టెంబా బావుమా (48) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
Next Story






