- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ ప్లేయర్ ను ర్యాగింగ్ చేసిన విరాట్ కోహ్లీ..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) గ్రౌండ్ లో రచ్చ చేశా

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) గ్రౌండ్ లో రచ్చ చేశాడు. తనకంటే జూనియర్ అయిన పంజాబ్ ప్లేయర్ ను దారుణంగా ర్యాగింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. పంజాబ్ ఆటగాడు నేహాల్ వధేరా (Nehal Wadhera ) రన్ అవుట్ అయిన నేపథ్యంలో... అతని చూస్తూ... అసభ్యకర ఎక్స్ప్రెషన్స్ తో ( Ex pressions) విరాట్ కోహ్లీ ఆట పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ పంజాబీ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. అయితే... ఈ మ్యాచ్ లో నేహాల్ వధేరా.. ఐదవ వికెట్ కు వచ్చి రన్ అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ సరిగ్గా 76 పరుగులు ఉన్న సమయంలో..నేహాల్ వధేరా రన్ అవుట్ అయి పెవిలియన్ కు వెళ్లాడు.
ఈ సందర్భంగా అతన్ని చూసుకుంటూ... విరాట్ కోహ్లీ అసభ్యంగా... ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే గత మ్యాచ్ లో ఇదే నేహాల్ వధేరా పైన... విరాట్ కోహ్లీ ఎన్నో ప్లాన్లు వేసి అవుట్ చేయాలని అనుకున్నాడు. కానీ పంజాబ్ జట్టును విజయతీలాలకు చేర్చాడు నేహాల్ వధేరా. అది మనసులో పెట్టుకొని ఇవాల్టి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇలా ప్రవర్తించాడని ఈ వీడియోను చూసి... ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






