- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబ్బబ్బా.. ఏం సూట్ అయ్యింది.. విరాట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవ్వాల్సిందే! (వీడియో)
ఐపీఎల్(Indian Premier League)లో ఎవరికి నచ్చిన టీమ్ వారికున్నా.. అందరూ కామన్‌గా ఇష్టపడే జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(Indian Premier League)లో ఎవరికి నచ్చిన టీమ్ వారికున్నా.. అందరూ కామన్‌గా ఇష్టపడే జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ. ఈ జట్టుకు టీమిండియా(Team India) స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రాతినిధ్యం వహించడంతో పాటు.. ఇప్పటివరకు అనేకసార్లు ఫైనల్‌కు వచ్చినా కప్ కొట్టకపోవడంతో అందరికీ సెకండ్ ప్రయారిటీగా మిగిలిపోయింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయినా, ముంబై ఫ్యాన్స్ అయినా, చెన్నై ఫ్యాన్స్ అయినా ముందు వారి వారి జట్టు కప్ సాధించాలని కోరుకుంటారు.. ఒక వేళ అనుకోని కారణాల వల్ల వారి ఫేవరెట్ టీమ్‌కు ఛాన్స్ లేకపోతే.. నెక్ట్స్ ఆర్సీబీ(Royal Challengers Bengaluru) కప్ సాధిస్తే చూడాలని ఉందని ఆకాంక్షిస్తారు. ఈ జట్టు మీద సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వేరే రేంజ్‌లో వస్తుంటాయి. ప్రతీసారి ‘‘ఈ సాలా కప్ నమ్‌దే(Ee Sala Cup Namde) అనే నినాదంతో బరిలోకి దిగుతున్న ఆర్సీబీని జట్టును కొందరు ట్రోల్స్ చేస్తుండగా.. మరికొందరు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడతారు.
విరాట్ కోహ్లీ కప్‌ను దొంగిలించినట్లుగా, ఇప్పటివరకు కప్‌లు సాధించిన ధోని(MS Dhoni), రోహిత్(Rohit Sharma) పక్కన ఫన్నీగా ఎడిట్ చేస్తూ పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మిగిలిన జట్ల అభిమానులకు, ఆర్సీబీ(RCB) అధికారులకు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో ఇంట్రెస్టింగ్ పోస్టు వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్(Game Changer)లో రామ్ చరణ్(Ram Charan) చెప్పిన డైలాగ్.. ‘‘మనం గెలుపు కొనకూడదు.. గెలుపు కోసం అమ్ముడు పోకూడదు’’ అనే వీడియోలో కోహ్లీని ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇది గమనించిన నెటిజన్లు అద్భుతంగా సెట్ అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మరికొందరు కోహ్లీ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
అబ్బబ్బా...... ఏం సూట్ అయ్యింది 😍😍 👌🏻👌🏻👌🏻👌🏻
— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) February 22, 2025
Most loyal team with loyal fan base 🙌
Tag RCB and Virat kohli fans ❤️#RCB #ViratKohli #IPL2025 #Cricket #RamCharan #GameChanger @GameChangerOffl pic.twitter.com/ee4WrpUDUU






