Virat Kohli : విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్

by Muthe.Rajitha |

ఐపీఎల్(IPL) టీ20ల్లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు సృష్టించారు.

Virat Kohli : విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL) టీ20ల్లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు సృష్టించారు. టీ20 మ్యాచుల్లో ఒకే వేదికగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా హిస్టరీ క్రియేట్ చేశాడు. టీ20ల్లో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం(Benguluru Chinnaswamy Stadium) వేదికగా ఇప్పటి వరకు 3,500 పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు. కాగా ఇలా ఒకే వేదికగా అత్యధిక పరుగులు సాధించిన పాత రికార్డులను కోహ్లీ తిరగరాశాడు. ఇది వరకు ఈ రికార్డ్ ముష్పీకర్ రహీమ్ (3,373-మీర్పూర్) మీద ఉండగా.. విరాట్ దానిని బద్దలు కొట్టాడు.

తరువాతి స్థానాల్లో జేమ్స్ విన్స్ (3,253-సౌతామ్టన్), అలెక్స్ హేల్స్ (3,241-నాటింగ్ హమ్) ఉన్నారు. కాగా తాజాగా 18వ ఐపీఎల్ సీజన్లో బెంగుళూరు జట్టు నిలకడగా ఆడుతూ పాయింట్ల టేబుల్ లో 4వ స్థానంలో ఉండగా.. ఈసారైనా కోహ్లీ టీం కప్పు కొడుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Next Story