అదే జరిగితే కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటాడు.. ఆసిస్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |   (  Updated:2025-06-07 01:44:32  IST  )

ఇంగ్లాండ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూస్తే విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

అదే జరిగితే కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటాడు.. ఆసిస్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూస్తే విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లార్క్ మాట్లాడుతూ..‘ఇంగ్లాండ్‌లో భారత్ 5-0తో టెస్టు సిరీస్‌ను కోల్పోతే అభిమానులు తిరిగి కోహ్లీ కావాలని కోరుకుంటారు. నిజాయితీగా చెప్పాలంటే కెప్టెన్, సెలెక్టర్లు అడిగితే, అభిమానులు మద్దతు ఇస్తే అతన్ని తిరిగొస్తాడని అనుకుంటున్నా. అతను ఇప్పటికీ టెస్టు క్రికెట్‌ను ఇష్టపడుతున్నాడు. టెస్టు క్రికెట్ కోహ్లీని మిస్ అవుతుంది.’అని చెప్పుకొచ్చాడు.


Next Story