- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లండన్ పార్క్ లో కోహ్లీ కొడుకు..ఫోటోలు వైరల్
by velandi.Saikiran |
లండన్ పార్క్ లో కోహ్లీ తన కొడుకుతో ఎంజాయ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

X
దిశ, వెబ్ డెస్క్: మొన్నటి వరకు ఐపీఎల్ సందర్భంగా బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ, ప్రస్తుతం లండన్ లోనే ఉన్నాడు. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరమైన కోహ్లీ, లండన్ లో తన ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అక్కడి ఓ ప్రముఖ పార్కులో తన కొడుకుతో ఎంజాయ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. తన భుజాలపై అకాయ్ ని మోసుకుంటూ, చిల్ అయ్యాడు. ఇక తండ్రి, కొడుకులు సరదాగా గడుపుతున్న నేపథ్యంలో అనుష్క శర్మ ఫోటోలు తీస్తూ బిజీగా కనిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా గుజరాత్ పైన 70కి పైగా పరుగులు సాధించి, బెంగళూరును ఛాంపియన్ గా నిలిపాడు కోహ్లీ. ఆ తర్వాత లండన్ కు వెళ్లాడు. త్వరలో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు మాత్రం కోహ్లీ అందుబాటులో ఉంటాడని చెబుతున్నారు.
Next Story






