కోహ్లీపై రైనా కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో తొందరపడ్డాడంటూ కామెంట్స్

by Harish |

గతేడాది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కోహ్లీపై రైనా కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో తొందరపడ్డాడంటూ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : గతేడాది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. అయితే, ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున సత్తాచాటాడుతున్నాడు. గురువారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 70 రన్స్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో సురేశ్ రైనా మాట్లాడుతూ.. కోహ్లీ అంతర్జాతీయ టీ20ల నుంచి త్వరగా తప్పుకున్నాడని వ్యాఖ్యానించాడు. 2026 టీ20 వరల్డ్ కప్ వరకు ఆడే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. ‘నేనే ఏమనుకుంటున్నానంటే కోహ్లీ టీ20 క్రికెట్‌ నుంచి త్వరగా రిటైర్డ్ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడాడు. ఐపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఆడుతున్న రిథమ్‌‌ను బట్టి 2026 వరకు అతను ఆడొచ్చు. కోహ్లీ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నాడు. ఫిట్‌నెస్ పరంగా అతను పీక్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.’అని రైనా చెప్పుకొచ్చాడు.


Next Story