- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli: ఒక్క అడుగు.. ఈ సారి కొట్టేస్తాం
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ) జట్టు ఫైనల్ కు చేరింది.

దిశ, వెబ్ డెస్క్ :ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ) జట్టు ఫైనల్ కు చేరింది. గురువారం పంజాబ్ కింగ్స్ జట్టుతో ( Punjab Kings) జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ జట్టు అద్భుతంగా ఆడింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి నేరుగా ఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలోనే.. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.
ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli)... స్టేడియం మొత్తం ఎగిరి గంతేశాడు. అంతేకాదు.. తన భార్య అనుష్క శర్మను ( Anushka Sharma) చూస్తూ... ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామంటూ సైగలు చేశాడు. కచ్చితంగా కప్ గెలుస్తామని... స్టేడియం నుంచి వేలు పైకి చూపించి మరి చెప్పే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చేసిన ఈ సైగలు వైరల్ గా మారాయి. కాగా ఇవాల్టి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. 12 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ సాల్ట్ మాత్రం చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపించాడు. ఇక జూన్ మూడవ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ ఆడనుంది.
Virat Kohli saying to Anushka Sharma that we are one more win away from IPL Trophy 🏆 pic.twitter.com/Hhl5AfxOAU
— Virat Kohli Fan Club (@Trend_VKohli) May 29, 2025






