రోహిత్, కోహ్లీ ఆ వరల్డ్ కప్ ఆడటం అసాధ్యం.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

by Harish |

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రోహిత్, కోహ్లీ ఆ వరల్డ్ కప్ ఆడటం అసాధ్యం.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఇక వన్డేలలో మాత్రమే కొనసాగనున్నారు. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టడానికే వీరు టెస్టుల నుంచి తప్పుకున్నారనేది పలువరి అభిప్రాయం. అయితే, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్, కోహ్లీ ఆ వరల్డ్ కప్ ఆడలేరని అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో గవాస్కర్ మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘రోహిత్, కోహ్లీ వన్డేలలో అద్భుతమైన ప్లేయర్లు. కానీ, 2027 వన్డే వరల్డ్ కప్‌‌ వరకు వీరు ఇలాగే ఆడగలరా? అని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది. వారికి ఆ సత్తా ఉందనుకుంటే వరల్డ్ కప్ ఆడతారు. కానీ, నిజాయతీగా నా అభిప్రాయం చెప్పాలంటే రోహిత్, కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడలేరు. కానీ, రెండేళ్లలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఒకవేళ బాగా ఆడుతూ, సెంచరీల మీద సెంచరీలు చేస్తే వారిని ఆ దేవుడు కూడా జట్టు నుంచి తప్పించలేడు.’అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.


Next Story