Virat Kohli: కోహ్లీ షాకింగ్ నిర్ణయం..ఇన్‎స్టాలో ఆ పోస్టులన్నీ డిలీట్..ఎందుకిలా చేశాడు?

by Vennela |   (  Updated:2025-04-10 05:22:28  IST  )

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Virat Kohli: కోహ్లీ షాకింగ్ నిర్ణయం..ఇన్‎స్టాలో ఆ పోస్టులన్నీ డిలీట్..ఎందుకిలా చేశాడు?
X

దిశ, వెబ్ డెస్క్: Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోహ్లీకి మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ ఇన్ స్టా ఖాతాకు 27.1 కోట్ల మంది ఎక్స్ ఖాతాకు 6.7కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే టాప్ బ్రాండ్లన్నీ అతనితోనే ప్రచారం చేయించేందుకు పోటీపడుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియోలను కూడా కోహ్లీ పోస్టు చేస్తుంటాడు. అయితే తన అకౌంట్లో ఇప్పటి వరకు అలాంటి వీడియోలే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో తన ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. యాడ్స్ కంటెంట్ ను పోస్ట్ ఫీడ్ ను డిలీట్ చేశాడు.

ఇందుకు గల కారణం ఏంటో తెలియదు కానీ..ప్రస్తుతం అతని ఇన్ స్టా ఖాతా తెరవగానే వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విషయాలే కనిపిస్తున్నాయి. క్రికెట్ విశేషాలు, జిమ్ లో కసరత్తులు, భార్య అనుష్క శర్మ, కుటుంబంతో దిగిన ఫొటోలు, వీడియోలతో పాటు తన వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించి పోస్టులు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

అయితే తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న యాడ్ వీడియోలను కోహ్లీ పూర్తిగా ఖాతా నుంచి తొలగించలేదు. వాటన్నింటినీ రీల్స్ సెక్షన్స్ లోకి మార్చారు. ఇప్పుడా వీడియోలన్నీ రీల్స్ లో కనబడుతున్నాయి. ఇందుకు గల కారణాన్ని కోహ్లీ టీమ్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మార్పుపై అభిమానుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. యాడ్స్ లేకపోవడం చాలా బాగుందని చెబుతుండగా..స్పాన్సర్స్ డీల్స్ ను బ్రేక్ చేసుకున్నాడా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచుల్లో బిజీగా ఉన్న కోహ్లీ ఇటీవలే మరో భారీ రికార్డును తన అకౌంట్లో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 13000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా రికార్డుల్లోకెక్కాడు.

Next Story