- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB ఆఫర్ రిజెక్ట్...ఫోన్ కూడా లిఫ్ట్ చేయని కోహ్లీ ?
కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో విరాట్ కోహ్లీ ఉన్నట్లు నేషనల్ మీ

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో విరాట్ కోహ్లీ ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రతి ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడేందుకు అగ్రిమెంట్ పై విరాట్ కోహ్లీ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఈ అగ్రిమెంటుపై ఇప్పటివరకు విరాట్ కోహ్లీ సంతకం చేయలేదని తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, విరాట్ కోహ్లీకి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
అయితే వాళ్లకు విరాట్ కోహ్లీ అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఫోన్ కూడా ఎత్తడం లేదట. దీంతో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని విరాట్ కోహ్లీపై వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత వన్డేలతో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. మరి దీనిపై కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. కాగా ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు కోహ్లీ. గత ఏడాది సీజన్ లో బెంగళూరు ఛాంపియన్ గా కూడా అవతరించింది. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ కు సిద్ధమవుతున్నాడట కోహ్లీ. క్లిక్






