- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు ఐదేళ్ల తర్వాత గత వారం వన్డేల్లో నం.1 బ్యాటర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కానీ, తాజా ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానం కోల్పోయాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్.. విరాట్‌ను వెనక్కి నెట్టి నం.1 ర్యాంక్‌ను అధిరోహించాడు. ఐసీసీ బుధవారం వన్డే ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. భారత్‌తో వన్డే సిరీస్‌లో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు బాదిన మిచెల్ భారీగా రేటింగ్ పాయింట్స్ పెంచుకోవడమే కాకుండా ఒక్క స్థానం మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. దీంతో విరాట్ నం.2 ర్యాంక్‌కు పడిపోయాడు. ఇద్దరి మధ్య 50 పాయింట్ల వ్యత్యాసం ఉంది.
ఇప్పట్లో భారత్‌కు వన్డే మ్యాచ్‌లు లేకపోవడంతో కోహ్లీ తిరిగి అగ్రస్థానం దక్కించుకోవడానికి ఎదురుచూడాల్సిందే. భారత్, కివీస్ మధ్య వన్డే సిరీస్‌లో మిచెల్ 352 రన్స్ చేయగా.. కోహ్లీ 240 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో నిరాశపర్చిన రోహిత్ శర్మ 4వ స్థానానికి పడిపోగా.. గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ టాప్-10లో చోటు సంపాదించాడు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ మాత్రమే టాప్-10లో ఉన్న ఏకైక భారత బౌలర్. అయితే, వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోని అతను 4 స్థానాలు కోల్పోయి 7వ స్థానంలో నిలిచాడు. యువ బౌలర్ హర్షిత్ రాణా 27 స్థానాలు మెరుగుపర్చుకుని 50వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా టాప్-100లో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.






