- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB: ఇదెక్కడి సంతరా... ఒకేసారి 4 పరుగులు తీశారు..వీడియో వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025 ) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB), పంజాబ్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025 ) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB), పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ( Vira Kohli ) అలాగే పడిక్కల్ ( Padikkal) చేసిన పని అందరిని ఆకట్టుకుంది. ఒక్క షాట్ కొట్టి నాలుగు పరుగులు... తీశారు విరాట్ కోహ్లీ, పడిక్కల్. పంజాబ్ కింగ్స్ బౌలర్ వేసిన.. ఓ బంతిని లెఫ్ట్ హ్యాండర్ అయిన పడిక్కల్ లెగ్ సైడ్ వైపు కొట్టాడు.
ఈ నేపథ్యంలోనే బంతి ఫోర్ గేట్ వైపు వెళ్ళింది. దాన్ని చేజ్ చేసుకుంటూ... ఫీల్డర్ కూడా పరిగెత్తాడు. ఇలాంటి నేపథ్యంలోనే... ఏకంగా నాలుగు పరుగులు తీశారు కోహ్లీ అలాగే పడిక్కల్. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ టోర్నమెంట్లో ఇలా నాలుగు పరుగులు చేసే మొనగాళ్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లే అంటూ.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అటు విరాట్ కోహ్లీ 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో... ఇంత వేగంగా ఎలా పరిగెత్తుతున్నాడని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. గ్రేట్ ఫిట్నెస్ విరాట్ కోహ్లీ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఏటి వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే మూడు వికెట్ నష్టపోయి... ఛేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
You won't see this very often in IPL. FOUR RUNS!pic.twitter.com/CH2DRrbIRJ
— CricTracker (@Cricketracker) April 20, 2025






