లండ‌న్ బ‌య‌లుదేరిన విరాట్ కోహ్లీ..వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

విరాట్ కోహ్లీ తిరుగు ప్రయాణమయ్యాడు. ఇండియాలో నేషనల్ బ్యూటీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ, మళ్లీ లండన్ పయనం

లండ‌న్ బ‌య‌లుదేరిన విరాట్ కోహ్లీ..వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తిరుగు ప్రయాణమయ్యాడు. ఇండియాలో నేషనల్ బ్యూటీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ, మళ్లీ లండన్ పయనం అయ్యాడు. దక్షిణాఫ్రికాతో మొన్నటి వరకు జరిగిన మూడు వన్డేల్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ, భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నమెంట్లో రెండు సెంచరీలతో పాటు ఓ అర్థ సెంచరీ కూడా నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. గత రెండు సంవత్సరాలలో ఎప్పుడు లేని ప్రదర్శన కనబరిచాడు. ఫుల్ కాన్ఫిడెన్స్ తో దక్షిణాఫ్రికా ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. ఈ దెబ్బకు 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకుని భారత జట్టు.

అయితే వన్డే సిరీస్ పూర్తికాగానే మళ్లీ లండన్ కి వెళ్ళాడు విరాట్ కోహ్లీ. ఈ మేరకు ముంబై విమానాశ్రయంలో ఆయన కనిపించిన వీడియో వైరల్ గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా లండన్ లోనే తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు విరాట్ కోహ్లీ. ఏకాంతంగా ఉండేందుకు లండన్ లోనే ఓ విల్లా కూడా కొనుగోలు చేశాడు. కేవలం వన్డేలు, ఐపీఎల్ టోర్నమెంట్ ఉంటేనే ఇండియాకు వస్తున్నాడు కోహ్లీ. కాగా ఈ నెల ఆఖరున బెంగుళూరులో జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ల‌లో కూడా విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. ఆ సమయానికి మళ్లీ ఇండియాకు వస్తాడు. అనంతరం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరిలో ఉంటుంది. ఆ టోర్నమెంట్ అయిపోయే వరకు మళ్లీ ఇండియాలోనే ఉండనున్నాడు.

Next Story