- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింక్ బాల్ టెస్టులో కోహ్లీ విఫలం.. విరాట్ చేసిన పనికి ప్రశంసలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌పై తనకున్న అభిరుచి, క్రమశిక్షణను మరోసారి చూపెట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌పై తనకున్న అభిరుచి, క్రమశిక్షణను మరోసారి చూపెట్టాడు. పింక్ బాల్ టెస్టులో పరాజయంతో టీమిండియా బాధలో ఉండగా.. కోహ్లీ మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తర్వాతి టెస్టు కోసం సిద్ధమయ్యే పనిలో పడ్డాడు. ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. మ్యాచ్‌కు ఇంకా ఆరు రోజుల సమయం ఉన్నది. కానీ,విరాట్ అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లీ నెట్స్‌లో సాధన చేశాడు. పెర్త్‌లో సెంచరీ బాదిన కోహ్లీ.. అడిలైడ్‌లో మాత్రం నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌ల్లో(7, 11) కలిపి 18 పరుగులే చేశాడు. అతని పేలవ ప్రదర్శన జట్టుపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో మూడో టెస్టులో లోపాలను అధిగమించాలని విరాట్ భావిస్తున్నాడు. కోహ్లీ డెడికేషన్‌ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. మిగతా ఆటగాళ్లలోనూ కోహ్లీ లాంటి క్రమశిక్షణను చూడాలనుకుంటున్నానని వ్యాఖ్యానించాడు.






